భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.