Pakistan: ఆసియా కప్ 2025లో అనుకొని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హ్యాండ్ షేక్’ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు హైడ్రామా చేస్తోంది. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రావాల్సి ఉండగా ఆటగాళ్లు అందరూ హోటల్ రూమ్ కే పరిమితమైంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో.. మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వని కారణంగా పాకిస్థాన్ జట్టు ఈ విధంగా నిరసన తెలుపుతోందని అర్థమవుతుంది.
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఒకేసారి అన్ని..!
నేడు జరగాల్సిన మ్యాచ్ కు మొదట పాకిస్తాన్ జట్టు దూరంగా ఉందని అందరు భావించారు. అయితే, ఇక్కడ ఓ కొత్త ట్విస్ట్ జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. పాకిస్తాన్ జట్టు మళ్లీ మనసు మార్చుకుని మ్యాచ్ ఆడటానికి సిద్ధమయింది. దీంతో పాకిస్తాన్ జట్టు బసచేస్తున్న హోటల్ నుండి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు బయలుదేరింది. అధికారిక వార్తల ప్రకారం మ్యాచ్ ఎనిమిది గంటలకు మొదలవ్వాల్సి ఉండగా గంట సమయం ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమవుతుందని ధ్రువీకరించారు.
They Call Him OG: పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రీమియర్స్ పడుతున్నాయ్!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డుపై ఐసీసీ ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టుపై క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా పాకిస్తాన్ కు క్లారిటీ ఉందని.. అది మ్యాచ్ ఆడే విషయంలోనైనా.. అలాగే ఇలా నిరసనలు తెలిపే విషయంలోనైనా క్లారిటీ లేకపోవడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.