Padi Kaushik Reddy : ప్రజల తరపున పోరాడటం నేను చేసిన తప్పా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు, కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో తమ అధికారిక పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. వారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు బాధ్యులైన అధికారులపై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయాలని ప్రయత్నించారు , కాని వారి ఫోన్ కాల్‌లకు వారు స్పందించిన తర్వాత వారు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. .స్పీకర్ ను కలవడానికి అసెంబ్లీకి వచ్చామని, స్పీకరు అపాయింట్ మెంట్ తీసుకునే వచ్చామని తెలిపారు. ఎందుకనో స్పీకరు మాకు టైం యిచ్చి అందుబాటులోకి రాలేదని, మా నియోజక వర్గాల్లో ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ నేతల పెత్తనం నడుస్తోందని, ప్రొటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారుల పై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవాలనుకున్నామన్నారు. స్పీకర్ మళ్ళీ ఎపుడు టైమ్ ఇస్తే అపుడు కలిసి ప్రివిలేజి మోషన్ ఇస్తామన్నారు.
అంనతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ మాకు ఉదయం 11 గంటలకు టైం ఇచ్చారని, ఒంటి గంట దాకా స్పీకర్ కోసం ఎదురు చూశామన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పీకర్ అందుబాటు లోకి రాలేదని, కరీంనగర్ జిల్లాల్లో అధికారులు యథేచ్ఛగా ప్రోటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, నేను విద్యా శాఖ పై రివ్యూ మీటింగ్ పెడితే నా పై క్రిమినల్ కేసు పెట్టారన్నారు. కరీంనగర్ డీఈవో, జడ్పీసీఈవోపై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవాలని అనుకున్నానని, డీఈవో ను సస్పెండ్ చేయించే దాకా నిద్రపోను అని కౌశిక్ రెడ్డి తెలిపారు. జడ్పీసీఈవో పై చర్యలు తీసుకునే దాకా నిద్రపోనని, ప్రజల తరపున పోరాడటం నేను చేసిన తప్పా అని యనా అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, చట్టం ముందు అందరూ సమానమే అన్నారు కౌశిక్ రెడ్డి. కోర్టు మొట్టి కాయలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదు.. అధికారుల తీరు వల్ల కల్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతున్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రోటో కాల్ ఉల్లంఘనలపై స్పందించాలి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయాయి.. నా మీద కేసులు పెడితే భయపడే వాడిని కాదు.. నేను జైలుకు పోవడానికి కూడా సిద్దమే.. సీఎం కాన్వాయ్ కు కూడా అడ్డం పడతా.. కచ్చితంగా ప్రివిలెజి మోషన్ ప్రవేశ పెడతా.. అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడుతూ.. విప్ ఆది శ్రీనివాస్ సీఎం కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నానన్నారు. .కేసీఆర్ ను తిడితే గొప్ప నాయకుడు కాలేవు ఆది శ్రీనివాస్ అని ఆయన అన్నారు. అధికారం ఉందని విర్ర వీగొద్దని, కేసీఆర్ ఉద్యమం చేసినపుడు ఆది శ్రీనివాస్ ఎక్కడున్నారన్నారు. కేసీఆర్ ను తిట్టి రేవంత్ మెప్పు పొందలేరని, వరద కాలువ సమస్యలు ఉన్నాయి..వాటి గురించి ముందు పట్టించుకోండన్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!