Paddy Issue: వర్షాలతో అన్నదాతల అగచాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కష్టపడి వరి పండించిన రైతులను వర్షాలు పరేషాన్ చేస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నాడు…కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోగా మరికొన్నిచోట్ల తేమ పేరుతో ఆలస్యం కావడం కర్షకులకు కష్టాలు ఎదురౌతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్ల పరిస్థితి రైతులను ఆందోనకు గురిచేస్తోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి..ముఖ్యంగా మంచిర్యాల ,నిర్మల్ జిల్లాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు.ఈరెండు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి..అయితే మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల ఇంకా కాంటాలు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా రైతులు రోడ్డుపై రాస్తారోకోలకు దిగుతున్నారు…బెల్లంపల్లి తోపాటు పలు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Also Read
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
ఇప్పటికే రెండు దఫాలుగా అకాల వర్షాలు రైతుల ధాన్యం ను నీటి పాలు చేసింది..కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం వరదనీటిలో కొన్నిచోట్ల కొట్టుకు పోయింది. రైతులకు కనీసం టార్ఫాలిన్లు సైతం అందుబాటులో లేకపోవడం కల్లాల్లో ధాన్యం తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో లక్ష 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా మొత్తం 43 రైస్ మిల్లులున్నాయి. 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో కొన్ని చోట్ల ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈసారి యాసంగి మంచిర్యాల జిల్లాలో 72 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.అయితే ఇందులో సగం కేంద్రాలు సైతం ప్రారంభం కాకపోగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్ లు,మరికొన్ని చోట్ల టార్ఫాలిన్లు లేక అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు..పొద్దంతా కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు నేర్పుతూ సాయంత్రం అయితే మళ్లీ కుప్పగా పోస్తూ కవర్లు కప్పేస్తూ తిప్పలు పడుతున్నారు..సకాలంలో కొనుగోలు చేయాల్సిన అధికారులు కాలయాసన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల సన్నవరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటున్నారు రైతులు,.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. తీవ్రమైన గాలులు,ఇంకో వైపు ఎండలతో కేంద్రాల వద్ద యాతన అనుభవిస్తున్నామంటున్నారు రైతులు. అధికారులు ఏం చేస్తారో చూద్దాం.
తాజావార్తలు
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!