అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో లెంకలగడ్డ గోదావరి సమీపంలో పిడుగు పడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం, మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Bird Flu : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని రైతులు తాము నష్టపోయిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో గత కొన్ని రోజులుగా కోళ్లు అనారోగ్యానికి గురవుతుండగా, ఈ సమస్య మరింత తీవ్రమై సుమారు 7,000 కోళ్లు ఆకస్మికంగా మరణించాయి. ఈ ఘటనతో గ్రామస్తుల మధ్య భయాందోళనలు వ్యక్తమయ్యాయి.…
కష్టపడి వరి పండించిన రైతులను వర్షాలు పరేషాన్ చేస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నాడు…కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోగా మరికొన్నిచోట్ల తేమ పేరుతో ఆలస్యం కావడం కర్షకులకు కష్టాలు ఎదురౌతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్ల పరిస్థితి రైతులను ఆందోనకు గురిచేస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి..ముఖ్యంగా మంచిర్యాల ,నిర్మల్ జిల్లాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు.ఈరెండు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి..అయితే మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల…