ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజసంగ్రామ యాత్ర నేడు ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నేడు గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.