ఎవ్రీ వీకెండ్‌లానే ఈ వీకెండ్ కూడా మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి పలు సినిమాలు, సిరీస్‌లు. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ అఖండ2 గత ఏడాది డిసెంబర్ 12న రిలీజైంది. థియేటర్స్‌లో సంక్రాంతి సీజన్ సినిమాలు స్టార్ట్ కావడంతో ఓటీటీ బాట పట్టింది. జనవరి 9 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైన శివకార్తీకేయన్ ఫిల్మ్ అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ.. ఇప్పుడు ఆహాలో సందడి చేస్తోంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించిన తొలి సినిమా బాల్టీ డిజిటల్ ఫ్లాట్ ఫాంపై సందడి చేస్తోంది. సెప్టెంబర్ 26న రిలీజైన ఈ బైలింగ్వల్ ఫిల్మ్ జనవరి 9న అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. దాదా ఫేం కవిన్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ మాస్క్. నవంబర్ 21న రిలీజైన ఈ సినిమా, రెండు నెలల తర్వాత జనవరి 9నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
సందీప్ రెడ్డి వంగా ప్రమోట్ చేసిన జిగ్రీస్ థియేటర్స్‌లో సక్సెస్ కాకపోయినా.. అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్ట్స్‌లో మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. అజయ్ దేవగన్- రకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీ దేదే ప్యార్ దే2 నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఇవే కాకుండా తమిళ రూరల్ ఫ్యామిలీ డ్రామా అంగమ్మల్, సైలెంట్ స్క్రీమ్.. ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంటరీ, రాధేయ అనే కన్నడ సినిమా సన్ నెక్ట్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. వర్ష బొల్లమ్మ, మేఘ లేఖ, రాజీవ్ కనకాల కీరోల్స్ చేసిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్‌లో జనవరి 8 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. 2024లో కాంట్రవర్సీకి గురైన వెబ్ సిరీస్‌లో ఒకటి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. సోన్ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకాష్ రాజ్, రాజ్ బి శెట్టి కీలక రోల్స్ చేసిన కన్నడ ఆంధాలజీ సిరీస్.. జీ5లో ప్రసారం అవుతుంది.