Balti: షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్ తో పాటు ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన తారాగణంగా ఉన్ని శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ‘బల్టీ’ చిత్రం తెలుగులో అక్టోబర్ 10న విడుదలవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది. మరో బిగ్ సేల్…
దక్షిణ చిత్ర పరిశ్రమలో యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్. తన తొలి సినిమా విడుదల కాకముందే, ఏకంగా ఏడు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశాలను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి సోలో సింగిల్ ‘కచ్చి సెరా’తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ప్రీతి ముఖుందన్‌తో కలిసి చేసిన ‘ఆశ కూడ’, మీనాక్షి చౌదరితో…