AMCA Deal: ఇండియన్ డిఫెన్స్‌లో గేమ్‌చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
- AMCA ఇంజిన్ల తయారీలో భారత్ కీలక అడుగు..
- రిలయన్స్-రోల్స్ రాయిస్ మెగా భాగస్వామ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AMCA Deal: రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే యుద్ధ విమానాల ఇంజిన్లను అభివృద్ధి చేసి తయారు చేసే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయిస్ సంస్థలు చేతులు కలిపాయి. భారత అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమం కోసం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేయాలనే వ్యూహాత్మక ఉద్దేశాన్ని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లోనే స్వదేశీ ఏరో-ఇంజిన్‌ను రూపకల్పన, అభివృద్ధి, తయారీ, పరీక్ష, సరఫరా, నిర్వహణ చేసే పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని ఈ రెండు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం దేశంలో ‘ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్’ ఏర్పాటు చేసే అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. ఈ కేంద్రం భవిష్యత్తులో ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ, సాంకేతికతకు కీలక హబ్‌గా మారే అవకాశం ఉంది.
రోల్స్ రాయిస్ టెక్నాలజీ.. రిలయన్స్ తయారీ సామర్థ్యం
ఈ ప్రాజెక్టులో రోల్స్ రాయిస్ తనకు ఉన్న విమాన ఇంజిన్ల తయారీ, ఏరోస్పేస్ టెక్నాలజీ అనుభవాన్ని అందించనుంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టులను అమలు చేయడంలో తనకున్న సామర్థ్యంతో పాటు తయారీ మౌలిక వసతులను అందించనుంది. దీంతో అత్యాధునిక సాంకేతికతను భారత తయారీ సామర్థ్యంతో కలిపే ప్రయత్నం జరగనుంది. ఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. జాతీయ భద్రత, రక్షణ సాంకేతికతల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకమని అన్నారు. రోల్స్ రాయిస్ సాంకేతిక పరిజ్ఞానం, రిలయన్స్ సామర్థ్యాలు కలిస్తే రక్షణ రంగంలో భారత్ మరింత శక్తివంతం కావడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి కీలక ముందడుగు అవుతుందని ఆయన తెలిపారు. మరోవైపు రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్బిల్గిక్ మాట్లాడుతూ.. భారత ఏరోస్పేస్ రంగాన్ని మరింత బలోపేతం చేసి స్వయం సమృద్ధిగా మార్చే దిశగా రిలయన్స్‌తో భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
AMCAకే పరిమితం కాదు..
ప్రస్తుతం ఈ భాగస్వామ్యం ప్రధానంగా AMCA కార్యక్రమం కోసం స్వదేశీ ఇంజిన్ అభివృద్ధిపై దృష్టి పెట్టినా.. భవిష్యత్తులో దీని పరిధి మరింత విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. రక్షణ రంగంతో పాటు సివిల్ ఏరోస్పేస్, పవర్, ప్రొపల్షన్ టెక్నాలజీల్లో కూడా కలిసి పనిచేసే అవకాశాలను ఈ సంస్థలు పరిశీలించనున్నాయి. ముఖ్యంగా యుద్ధ విమాన ఇంజిన్‌కు సంబంధించిన మొత్తం జీవితచక్రాన్ని భారత్‌లోనే నిర్వహించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే ఇంజిన్ రూపకల్పన నుంచి అభివృద్ధి, తయారీ, పరీక్ష, ఉత్పత్తి, దీర్ఘకాలిక నిర్వహణ వరకు కీలక ప్రక్రియలను ఇండియాలోనే చేపట్టేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్ల కోసం భారత్ ఇకపై విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశీయ ఏరోస్పేస్ తయారీ రంగానికి, రక్షణ సాంకేతికతకు ఇది పెద్ద ఊతంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?