Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faria Abdullah: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె బోరున ఏడుస్తూ తన వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం, మతంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన తండ్రి ఇస్లాంపై ఉన్న నమ్మకంతో ఆ మతంలోకి మారారని తెలిపారు. తన తండ్రి విశ్వాసాలను తాను గౌరవిస్తానని చెప్పారు. అంతేకాదు.. తాను కూడా ఇస్లాం గురించి మంచి విషయాలను మాత్రమే చెబుతుంటానని పేర్కొన్నారు. మతం విషయంలో మనుషుల మధ్య విభేదాలు కాకుండా ప్రేమ, మానవత్వం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన ఓ మాటను గుర్తు చేసుకున్న ఫరియా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “అల్లా అన్నింటా ఉంటారు” అని తన తల్లి చెప్పేవారని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో తల్లిదండ్రులు నేర్పిన విలువలు ఎంతో ముఖ్యమైనవని ఆమె వెల్లడించారు. తనను విమర్శించే, ద్వేషించే వ్యక్తుల గురించి కూడా ఫరియా ఆసక్తికరంగా స్పందించారు. తనను ద్వేషించే వారిని సైతం తాను ప్రేమిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించాలని, వ్యక్తిగత విశ్వాసాలను బట్టి మనుషులను తీర్పు ఇవ్వకూడదనే భావనను ఆమె వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె పాల్గొన్న తీరుపై కొందరు నెటిజన్లు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబం, మత విశ్వాసాలు, తన ఆలోచనల గురించి ఫరియా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫరియా అబ్దుల్లా చేసిన తాజా కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Kamal : సిద్ధా' డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
- Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
తాజావార్తలు
-
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
-
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
-
Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!