NTV Telugu Site icon

Oppo Reno13: అత్యాధునిక ఫీచర్లతో భారత్‌ మార్కెట్‌లోకి వచ్చేసిన ఒప్పో రెనో 13 సిరీస్‌

Oppo Reno 13

Oppo Reno 13

Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తున్నాయి. కొత్తగా సిగ్నల్ బూస్ట్ టెక్నాలజీతో వస్తోంది. OPPO X1 సిగ్నల్‌ బూస్ట్ చిప్‌ వల్ల వైఫై ట్రాన్సిమిషన్ పవర్‌ 25% మెరుగుపడుతుంది.

Also Read: Game Changer : నార్త్ లో గేమ్ ఛేంజర్ సాలీడ్ బుకింగ్స్.. గంటకు ఎన్ని అంటే ?

ఇక ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో వచ్చింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ తహా వస్తుంది. ఇక కెమెరా పరంగా చూస్తే.. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా అలాగే ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక 5600mAh బ్యాటరీ, 80W వైర్‌ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఏ మొబైల్ ధరల విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మోడల్ రూ.37,999గా, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.39,999 గా కంపెనీ నిర్ణయించింది.

Also Read: RBI: ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!

ఇక ఒప్పో రెనో 13 ప్రో స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే.. ఇందులో 6.83 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇందులో ప్రాసెసర్ గా మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌, 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండగా.. ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇందులో 5800mAh బ్యాటరీ, 80W Supervooc ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఈ మొబైల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.49,999గా, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ రూ.54,999గా ధరలను కంపెనీ నిర్ణయించింది. ఇందులో సూపర్‌ కెమెరా సామర్థ్యాలు, AI లైవ్‌ఫోటో, అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, అధునాతన బ్యాటరీ పనితీరు ఇందులో ప్రత్యేకతలు. లుమినస్‌ బ్లూ, ఐవరీ వైట్‌, మిస్ట్‌ లావెండర్‌, గ్రాఫైట్‌ గ్రే రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌ జనవరి 11 నుంచి సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Show comments