Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10నాడే మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే.. లక్నోలో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కు రికార్డు సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
Read Also:Chhattisgarh: కూలిన చిమ్మీ.. నలుగురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది
మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ పొలిటికల్ డ్రామాగా రానుంది. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇపుడు మన తెలుగు హీరోలు హిందీ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు.
Read Also:YS Jagan: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగింది
మరి రామ్ చరణ్ నుంచి వస్తున్న గేమ్ ఛేంజర్ కి కూడా నార్త్ మార్కెట్ లో వసూళ్ల పట్ల ఆసక్తి నెలకొంది. మరి అక్కడ బుక్ మై షో గణాంకాల ప్రకారం ముంబై లాంటి కొన్ని మేజర్ సిటీలలో అలాగే పలు సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించి సినిమాకు డీసెంట్ బుకింగ్స్ ని నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా చోట్ల సాయంత్రం షోలకు మంచి బుకింగ్స్ కనిపిస్తుండడం విశేషం. సో సరైన ప్రమోషన్లు లేకపోయినప్పటికీ హిందీ మార్కెట్ నుంచి డీసెంట్ నంబర్స్ ని గేమ్ ఛేంజర్ అందుకునే అవకాశం ఉందనే చెప్పాలి. మరి డే 1 అక్కడ ఎలాంటి వసూళ్లు అందుకుంటాయో చూడాలి.