OPPO A5 Pro 5G: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO, భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన OPPO A5 Pro 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇది 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కి 360° ఆర్మర్ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలదు. 14 మిలిటరీ గ్రేడ్ పరీక్షల్లో ఈ ఫోన్ పాస్ అయింది. ఇందులో బయానిక్ కుషనింగ్ ఉండడంతో ఇది లోపలి భాగాలను “ఎయిర్ బ్యాగ్” లా కాపాడుతుంది. అల్‌మినియం మదర్‌బోర్డ్ కవర్, సాధారణ గ్లాస్‌తో పోలిస్తే 160% ఎక్కువ షాటర్ రెసిస్టెంట్ గ్లాస్‌తో ఇది వస్తుంది.
ఈ ఫోన్‌కి IP66, IP68, IP69 సర్టిఫికేషన్లు ఉన్నాయి. అంటే ఇది దుమ్ము, ధూళి, నీటిలోనూ పూర్తి భద్రతతో పనిచేస్తుంది. టీ, కాఫీ, పాలు, సోడా వంటి 18 రకాల ద్రవాల స్పిల్స్‌ను కూడా తట్టుకోగలదు. OPPO A5 Pro 5Gలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ ఉన్న 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇక ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరా కలిపిన డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు తీసుకునేందుకు 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో 5800mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 45W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతిస్తుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 15పై కలర్ OS 15, డ్యుయల్ 4G వోల్టే, బ్లూటూత్ 5.3, Wi-Fi 5, USB టైపు-C వంటివి ఉన్నాయి. OPPO A5 Pro 5G ఫోన్ ఫీథెర్ బ్లూ, మోచన్ బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్స్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 17,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో స్టోర్, ప్రధాన రిటైల్ అవుట్‌లెట్లు ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక లాంచ్ ఆఫర్ల కింద SBI, IDFC FIRST Bank, BOB Financial, Federal Bank, DBS క్రెడిట్ కార్డులపై 10% ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ గరిష్ఠంగా రూ.1,500 లభిస్తుంది. 6 నెలల పాటు నో-కాస్ట్ EMI, డౌన్‌పేమెంట్ లేకుండా కన్జ్యూమర్ లోన్స్, ప్రముఖ ఫైనాన్స్ భాగస్వాములతో జీరో డౌన్ పేమెంట్ స్కీమ్ లాంటి పలు ఆఫర్స్ ఉన్నాయి.