క్యూట్ హీరోయిన్ సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందం మరియి అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిందీ ఈ భామ .అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది . 2003లో దిల్ పరదేశీ హో గయా అనే హిందీ ద్వారా వెండి తెరకు పరిచయమైందీ ఈ ముద్దుగుమ్మ. తరువాత ధనా 51 మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆమె పలకరించింది. ఆ తర్వాత తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఒక ఊరిలో’ తో నటిగా మంచి గుర్తింపు ను అయితే సంపాదించుకుంది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం ఆమె అందుకోలేకపోయింది. మగధీర చిత్రంలో చిన్న గెస్ట్ రోల్‌లో నటించి అందరిని అలరించింది. ఇక అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న లో హీరోయిన్‌గా నటించి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను కూడా అందుకుంది.
దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తాయని అంతా కూడా భావించారు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా అయితే మారింది. పెద్దగా అవకాశాలు అయితే ఆమెకు రాలేదు. దీనితో చేసేది ఏమి లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పలు చిత్రాల్లో నటించింది.చివరిగా 2016లో వచ్చి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది మరో సినిమాలో అయితే నటించలేదు. సినిమాల కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందని సమాచారం.సలోని ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సలోని 1987 జూన్ 1వ తేదిన జన్మించింది. ఈ బ్యూటీ 36 ఏళ్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సలోనికి సంబంధించి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి సలోనికి ఇప్పటికీ చాలా తేడా అయితే కనిపిస్తోంది. పూర్తిగా మారిన సలోనిని చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.