బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.