నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్ ఒప్పందం…