అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యంలో కాల్పుల మోతతో ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తామోలేదో అన్న పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న న్యూయార్క్ సూపర్ మార్కెట్ కాల్పుల ఘటన మరవకముందే వరుసగా దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. నిన్నటికి నిన్న నల్గొండకు చెందిన సాయి కుమార్ అనే యువకుడిపి దుండగులు కాల్పులు జరపడంతో కారులోనే మృతి చెందాడు. అయితే తాజాగా నార్వే రాజధాని ఓస్లోలోని ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు కాల్పులకు దిగారు.
దీంతో నైట్ క్లబ్‌లో ఇద్దరు మృతి చెందగా… మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే.. శనివారం నగరంలోని ప్రముఖ లండన్ పబ్ (గే బార్, నైట్ క్లబ్)లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నామని చెప్పిన అధికారులు.. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వివరించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు అధికారులు.