Organs Donating : అమెరికాలో ప్రస్తుతం ఓ బిల్లు దుమారం రేపుతోంది. మానవత్వం కలిగియున్న ఖైదీల శిక్ష తగ్గించేందుకు అక్కడ ప్రభుత్వం కొత్త బిల్లు ప్రతిపాదించింది. అవయవదానం చేయటానికి ముందుకొచ్చి సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే శిక్షలను తగ్గించేలా మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభ సభ్యులు కొంతమంది ఈ బిల్లును ప్రతిపాదించారు. అవయవదానం లేదా బోన్ మ్యారో(ఎముక మూలుగ)ను దానం చేసిన ఖైదీల శిక్ష తగ్గించాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశ్యం. దీనికి అంగీకరించిన ఖైదీలకు రెండు నెలల నుంచి ఏడాది పాటు శిక్ష తగ్గించేలా ఈ బిల్లు ప్రతిపాదించారు. మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభలో డెమోక్రాటిక్ ప్రతినిధి కార్లోస్ గొంజాలెజ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.
Read Also: Turkey, Syria Earthquake : 22వేలు దాటిన మృతులు.. శిథిలాల కిందే వేలమంది
కానీ ఈ బిల్లుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవయవదానం చేయడాన్ని నిషేధించిన ఫెడరల్ ప్రభుత్వ చట్టానికి ఇది వ్యతిరేకమని ‘క్విడ్ ప్రోకో‘ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి విమర్శలతో జైలులో ఉన్న ఖైదీలను దాతలుగా ఉండకుండా ఏ చట్టమూ నిరోధంచలేదని కార్లోస్ గొంజాలెజ్ అన్నారు. మసాచుసెట్స్ లో ఉన్న ప్రతీపౌరుడికి ఉండ ప్రాథమిక హక్కలు జైలులో ఉండే ఖైదీలకు కూడా ఉండాలన్నారు. కానీ కొంతమంది పరిశీలకులు మాత్రం అవయవదానం తరువాత ఖైదీలకు జైళ్లలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం అధికారుల ముందున్న మరో సవాల్ అని అంటున్నారు. కాగా..మసాచుసెట్స్ జైళ్లలోని ఖైదీల్లో ఎక్కువశాతం నల్లజాతీయులు, లాటిన్ అమెరికా సంతతి వారే ఉన్నారు. దీంతో.. ఈ బిల్లు వల్ల మైనారిటీలకు అన్యాయం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఈ బిల్లును ఆమోదం అంత సులువుకాదన్న వార్తలు వస్తున్నాయి.