శ్రీలీల..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ. రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ సమయంలో ఈ భామకు వరుసగా పది సినిమాల అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది.ఈ వరుస అవకాశాల హడావుడి లో పడి కథలు ఎంపిక లో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వరుస సినిమాలు ఒప్పుకున్నంత ఈజీగా వరుస విజయాలు వస్తాయని నమ్మకం లేదు.. ఇప్పుడు ఇదే శ్రీలీల విషయంలో జరుగుతుంది. అప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ ఇప్పుడు నెలకు ఒకటి విడుదలవుతున్నాయి. కాకపోతే సినిమా ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వస్తున్నాయి. కథ కాకుండా కాంబినేషన్ పై ఫోకస్ పెడుతూ.. తప్పు చేస్తుందని విషయం ఆమె సినిమాల ఫలితాలను చూస్తుంటే అర్థమవుతుంది.
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కంద ఎన్నో రకాలుగా ట్రోల్ అవుతుంది . హ్యాట్రిక్ అందుకుందాం అనుకున్న శ్రీలీల ఆశలకు ఈ సినిమా గండి కొట్టింది.ఇదిలా ఉంటే దసరాకు విడుదలైన భగవంత్ కేసరితో ఫామ్ లోకి వచ్చినా.. ఇందులో శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఏ హీరోయిన్ చేయలేరు. కానీ శ్రీలీల ఆ ప్రయోగం చేసింది. ఇటీవల మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా ఆదికేశవ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా గత శుక్రవారం విడుదలయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇలా వరుస సినిమాలు ప్లాప్ అవ్వడంతో శ్రీలీల కు బ్యాడ్ టైం నడుస్తుందని అంతా అనుకుంటున్నారు. గతంలో హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా 5 ఫ్లాపులు రావడంతో ఆ భామ అవకాశాలు రాక సైలెంట్ అయిపొయింది.. దీనితో శ్రీలీల కెరీర్ కూడా అలా అవుతుందేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆదికేశవ సినిమా నిరాశ పరచడం తో ప్రస్తుతం శ్రీలీల ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలపైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది..