OG Car Show: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో నటించిన కమర్షియల్ చిత్రం ఓజి (OG) ఈనెల 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అమెరికాలోని అట్లంటా ప్రాంతానికి చెందిన కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా ఓ కార్ షోను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తుంది. కార్ షో బైక్ తాజ్ (Car Show by TAJ) అనే పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Mirai Collections: బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న ‘మిరాయ్’ కలెక్షన్స్..!
ఈ కార్ షోలో పదుల సంఖ్యలో కార్లను ఉపయోగించి OG అక్షరాలను రూపొందించారు. ప్రధానంగా ఎరుపు, నలుపు రంగు కార్లతో ఏర్పాటు చేసిన ఈ కాన్వాయ్ దృశ్యం చూడడానికి ఎంతగానో బాగుంది. ఈ కార్యక్రమం సంబంధించిన ఏరియల్ షాట్స్ అబ్బురపరుస్తున్నాయి. ఈ కార్ షో కేవలం విజువల్ ట్రీట్ మాత్రమే కాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆర్గనైజేషన్ పై కూడా నేటిజన్స్ ప్రశంసల కురిపిస్తున్నారు. మొత్తానికి అట్లాంటా ఫాన్స్ నిర్వహించిన ఈ కార్ షో పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమానులు చూపుతున్న అభిమానం ఏంటో ఇట్లే అర్థమవుతుంది. చూడాలి మరి.. సెప్టెంబర్ 25 నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
IPhone 17 Blinkit: కేవలం 30 నిమిషాల్లో మీ చేతిలోకి ఐఫోన్ 17.. ఎలా అంటే?
Idekkadaaaa masss ra mowaaa 🙏🏻🔥
Atlanta fans….♥️#OG #TheyCallHimOG pic.twitter.com/GofCA49vYl— DVV Entertainment (@DVVMovies) September 18, 2025