Himayatsagar Reservior: పెరిగిన వరద ఉధృతి.. ఆరు గేట్లు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భరీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వరద నీరు భారీగా వస్తుండటంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు కొనసాగుతుండటంతో హిమాయత్ సాగర్ ఆరు గేట్లను ఎత్తి అదనపు నీటిని విడుదల చేసినట్టు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. గేట్లు ఎత్తి 4120 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.
Read Also: Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో.. హిమాయత్ సాగర్ జలాశయంకు భారీగా నీరు చేరుతుంది. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు రిలీజ్ చేశారు. అయినా.. హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో తగ్గకపోవడంతో మరో ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు జల మండలి అధికారులు విడుదల చేశారు. హిమాయత్ నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసి వేశారు. ఇరువైపుల బారీ కేడ్స్ ను రాజేంద్రనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో కింద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదకు భారీగా నీటి ప్రవాహం వచ్చింది. సర్వీస్ రోడ్డు మీద ఫుల్ ఫోర్స్ తో నీరు వెళ్తుంది. సర్వీస్ రోడ్డు మీద రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేసి.. వాహనాలు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Snakes: అల్లుళ్లకు కట్నంగా స్నేక్ రాజాలు.. అదే వారి ఆచారం..!
చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల భారీ వర్షాలు సైతం కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా, రాగల 24 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు. అయితే, హైదరాబాద్ కు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.
తాజావార్తలు
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?