Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- ఇన్ఆర్బిట్ మాల్ వద్ద ఘోర ప్రమాదం
- అతివేగమే ప్రాణం తీసిందా?
- సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
- సంజుష్‌పై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjush : మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వద్ద జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందారు. అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారును జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజుష్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు (Crime No. 1238/2026) చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భోజన విరామం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
ఆగస్టు 16న మధ్యాహ్నం వేళ లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ గర్ల్స్‌గా పనిచేస్తున్న భారతి ముఖి, పూజా అశోక్ భోజనం కోసం ఐటీసీ కోహినూర్ సమీపానికి వెళ్లారు. భోజనం ముగించుకుని తిరిగొస్తూ ఇన్ఆర్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతుండగా TG-09-G-0666 నంబరు గల కారు వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చి భారతి ముఖిని బలమైన దెబ్బతీసింది. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also Read
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
సీసీటీవీల పరిశీలన.. విచారణ వేగవంతం
సహోద్యోగి పూజా సమాచారంతో స్టోర్ మేనేజర్ పంజల అశ్విన్ కుమార్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాద సమయంలో కారును సంజుష్ నడుపుతున్నట్లు తేలడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతివేగంగా వాహనం నడిపి యువతి మృతికి కారణమైనందున సంజుష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పోలీసులు కారు వేగం, ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, రోడ్డు పరిస్థితులు , ప్రత్యక్ష సాక్షుల ఆధారాలను పరిశీలిస్తున్నారు. విధులు నిర్వహిస్తూ సాధారణ భోజన విరామానికి వెళ్లిన యువతి క్రూర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!