తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భరీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వరద నీరు భారీగా వస్తుండటంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.