Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఇంకా ఎందుకు యాక్టివ్ అవలేదు? పొలిటికల్ డార్క్‌లోకి వెళ్ళిపోయి రెండేళ్ళు గడుస్తున్నా… ఇంకా స్క్రీన్ మీదికి రాకపోవడానికి కారణాలేంటి? సర్జరీ పూర్తయి నెలలు గడుస్తున్నా… కనీస రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన గురించి రాజకీయవర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఏపీ పొలిటికల్ ఫైర్‌బ్రాండ్స్‌లో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచిన నాని…. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. మొదట్నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుటుంబంపై దూకుడుగా మాట్లాడే కొడాలి…. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా జోరు పెంచారు. ఆ దెబ్బకు పసుపు పార్టీ హిట్ లిస్టులో చేరిపోయారాయన. ఇక గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి హిట్ లిస్టులో ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్స్‌పై కేసులు, అరెస్టుల్లాంటివి వరుసగా జరిగిపోయాయి. అలాంటి అరెస్ట్‌ల జాబితాలో కొడాలి నాని కూడా ఉంటారని చాలా మంది ఊహించారు. అయితే… ఆయనపై పలు కేసులు నమోదైనా… అరెస్టులు మాత్రం జరగలేదు. అదే సమయంలో హార్ట్ సర్జరీ జరగటంతో పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనేది కొడాలి సన్నిహితుల మాట. కానీ… ఆపరేషన్ జరిగి కూడా చాలా రోజులైన క్రమంలో… నాని రీ ఎంట్రీ ఎప్పుడంటూ… వైసీపీ కేడర్‌లో సైతం చర్చలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి టీడీపీ హిట్ లిస్ట్‌లో ఉన్న ముఖ్య నేతలు పేర్ని నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటి వారిపై అనేక కేసులు నమోదు అయ్యాయి జోగి రమేష్. వల్లభనేని వంశీ ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పూర్తి యాక్టివ్‌గా ఉన్నారు పేర్ని నాని. ఆయన మీద కూడా అనేక కేసులు నమోదయ్యాయిగానీ… అరెస్ట్ అవలేదు. తన గళం గట్టిగానే వినిపిస్తున్నారు పేర్ని. అయితే గుడివాడ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో స్థానికంగా ఉన్న నేతలు మాత్రమే పాల్గొంటున్నారు.
గతంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాత్రమే కొడాలి నాని పాల్గొన్నారు. సర్జరీ జరిగిందని, ఆరు నెలలపాటు రెస్ట్ తీసుకొని తిరిగి పూర్తిగా యాక్టివ్ అవుతానని ఆయన ప్రకటించడంతో శ్రేణులు ఎదురు చూశాయి. అయితే… నెలలు గడుస్తున్నా… ఇప్పటికీ ఆయన రంగంలోకి దిగపోవటంతో ఎప్పుడు వస్తారు? ఎందుకు ఆలస్యం అవుతోందంటూ… సొంత కేడర్ ఆరా తీస్తోందట. అయితే… కొడాలి నాని పూర్తిస్థాయిలో డైరెక్ట్ పాలిటిక్స్ చేయకున్నా… నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను పలకరించడం, వాళ్లకు సంబంధించిన శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేస్తున్నారట. అయితే… క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని క్యాడర్ కోరుకోవడం వెనక వేరే కారణాలు ఉన్నాయంటున్నారు. అధికారులు, ప్రభుత్వ వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా…. నియోజకవర్గ విపక్ష నేతగా నానిని కలిసి ఇబ్బందులు చెప్పుకుందామంటే కుదరడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో మా లీడర్ అందుబాటులో ఉంటే… ఆ పని జరగడంతోపాటు స్థానిక ఎమ్మెల్యే మీద పెరిగే వ్యతిరేకతను కూడా అనుకూలందా మల్చుకోవచ్చన్నది వైసీపీ కేడర్ అభిప్రాయం. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే తాము కూడా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నామన్నది వాళ్ళ వాయిస్. అయితే…. సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నందునే… కొడాలి నాని ఇంకా ఇవ్వటానికి సమయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అంతే తప్ప…. కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడి కాదని అంటున్నారు. మొత్తం మీద ఆయన నేరుగా రంగంలోకి దిగితేనే గుడివాడ వైసీపీ కేడర్‌లో ఊపొస్తుందన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం.
Also Read
- Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- Tags
- gudivada
- kodali nani
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!