West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- బెంగాల్ నుంచి అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ..
- సీఏఏ అమలు ప్రారంభించినట్లు చెప్పిన సీఎం సువేందు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడానికి సిద్ధమైంది. సీఏఏ కింద బంగ్లాదేశీ వలసదారుల్ని దేశం నుంచ బహిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సీఎం సువేందు అధికారి ప్రకటించారు. గత ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించిందని, ఈ చట్టాన్ని ఈరోజు( మే20) నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఏఏ ప్రకారం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు భారత్ వచ్చినట్లయితే వారు పౌరసత్వానికి అర్హులు అవుతారు. సీఏఏ నిబంధన కింద లేని, వేరే దేశం నుంచి వచ్చిన ఇతర మతాల వారిని బీఎస్ఎఫ్కు అప్పగించి, దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
సీఎం సువేందు అధికారి టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలోని ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించిందని, ఇప్పుడు మేము దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 31, 2024 వరకు భారత్ దేశానికి వచ్చినవారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన హింసను ఎదుర్కొని భారత్ వచ్చిన వారికి ఇది కటాఫ్ డేట్. దేశభద్రత కోసం సరిహద్దుల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ చట్టాన్ని అమలు చేయాలని డీజీసీ, సీఎస్‌కు ఆదేశించినట్లు సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?