KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతున్న 65వ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ముంబై ఇండియన్స్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసి తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7) నాటౌట్‌గా ఉన్నారు.
టాప్ ఆర్డర్‌ను నలిపేసిన గ్రీన్, సౌరభ్ దూబే..
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. కేకేఆర్ బౌలర్ కేమరూన్ గ్రీన్ మూడో ఓవర్లోనే ముంబైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6)ను మనీష్ పాండే అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపగా.. ఆ వెంటనే నమన్ ధీర్‌ను కూడా గ్రీన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాది మంచి ఊపు మీద కనిపించినప్పటికీ.. 15 పరుగుల వద్ద సౌరభ్ దూబే బౌలింగ్‌లో కేమరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే ప్రమాదకరమైన సూర్యకుమార్ యాదవ్ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసి సౌరభ్ దూబే బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ముంబై పవర్‌ప్లే ముగిసేసరికే పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత భారీ వర్షం పడటంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు.
ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ ఇలా పేకమేడలా కూలిపోవడంతో సోషల్ మీడియాలో మళ్లీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నప్పుడల్లా ముంబై జట్టు ఇలాగే దారుణంగా విఫలమవుతోందని కొందరు నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.
అయితే, దీనిపై పాండ్యా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యాకు అస్సలు సపోర్ట్ చేయడం లేదని, అందుకే మ్యాచ్‌ల్లో కనీస బాధ్యత లేకుండా వికెట్లు పారేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కెప్టెన్‌గా జట్టును గెలిపించాలనే కసితో గాయం నుంచి కోలుకుని హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చినా.. టీమ్‌లోని మిగిలిన ప్లేయర్స్ పూర్ పర్ఫార్మెన్స్తో అతడిని ఒంటరిని చేస్తున్నారనే వాదనలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. వర్షం తగ్గాక హార్దిక్, తిలక్ వర్మలు కలిసి ముంబైని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!