Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kadiyam Srihari 3

Off The Record : లేటు వయసులో ఘాటు రాజకీయాలు

Published Date :March 31, 2024 , 10:59 pm
By Gogikar Sai Krishna
Off The Record : లేటు వయసులో ఘాటు రాజకీయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కడ ఆయన…ఇక్కడ ఈయన. ఫేటు మారుస్తాయన్న కాన్ఫిడెన్స్ తో చేస్తున్న లేటు వయస్సు…ఘాటు రాజకీయాలు హాట్ హాట్ డిస్కషన్ గా మారాయి. రాజకీయ చరమాంకంలో ఆ ఇద్దరి అడుగులు ఎటువైపు అంటూ అనుచరులే తెగ మాట్లాడుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య….కడియం శ్రీహరి….దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నవారే. ఇద్దరూ వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు. వీరి రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా మారిపోయాయి. లక్ష్మయ్య నాలుగు టర్మ్ లు, కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి 2023 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నమ్ముకున్న కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం లేదని కారెక్కారు. మరో నేత కడియం శ్రీహరి కూడా ఇలాగే హస్తంగూటికి చేరారు. టిడిపిలో రాజకీయం మొదలుపెట్టిన కడియం…అనేక మంత్రి పదవులు పొందారు. ఇటీవల మారుతున్న రాజకీయాల్లో భాగంగా కడియం కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. లేటు వయస్సులో ఘాటు రాజకీయాల తరహాలో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతల పొలిటికల్ జర్నీ క్లైమాక్స్ రకరకాల మలుపులు తిరుగుతోంది.

కడియం శ్రీహరి..1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. Ntr కేబినెట్ లో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో సంక్షేమ శాఖ, విద్య, నీటిపారుద‌ల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కడియం శ్రీహరి 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై….తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సాగించారు కడియం. ఇప్పుడు అదే పార్టీ చెంతకు చేరారు. ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. జనగామ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పీసీసీ తొలి అధ్యక్షులు అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో మసస్తాపం చెంది, కారెక్కేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి పీసీసీ చీఫ్ అయ్యే వరకు…బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేసిన ఆయన… 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ఇద్దరూ దాదాపు రాజకీయ చరమాంకానికి వచ్చారు. వారసులను ముందుపెట్టి తెరవెనక రాజకీయానికి పరిమితం అయ్యే దశకు చేరారు. అందులోనూ ఒక పార్టీకి బద్ద వ్యతిరేకులుగా దశాబ్దాలుగా పోరాడి, చివరికి అవే పార్టీల్లోకి జంప్ అయ్యారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రాజకీయమూ మారాలని సమర్థించుకుంటున్నారు. రాజకీయం అంతేనా…లేదంటే నేతలకు గత్యంతరంలేని పరిస్థితులా…..ఏదేమైనా….ఇద్దరు నాయకుల మధ్య పోలిక సేమ్ టు సేమ్ అంటున్నారు పొలిటికల్ పండితులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kadiyam srihari
  • ntv
  • off the record

తాజావార్తలు

  • Supreme Court: మతం మారితే ఎస్సీ హక్కులు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

  • Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!

  • Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?

  • SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!

  • 8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions