Off The Record : పాతబస్తీ దాటి ఆ పార్టీ బయటికొస్తే నష్టం ఎవరికీ.? దెబ్బ పడేదెవరికి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై కొత్త చిత్రాలు కనిపించబోతున్నాయా? పతంగి పార్టీ కేంద్రంగా పరిణామాలు మారుతున్నాయా? పాతబస్తీ దాటి ఆ పార్టీ బయటికి వస్తే…నష్టం ఎవరికి? ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీలిస్తే…దెబ్బ పడేది ఎవరికి? అసలు మజ్లిస్ అధినేత మనసులో ఏముంది? లెట్స్ వాచ్.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది ఎంఐఎం. తెలంగాణ ఏర్పాటయ్యాక మిత్రులు మారిపోయి బీఆర్‌ఎస్‌తో దోస్తీ కుదిరింది. ఇన్నాళ్ళు ఆ మైత్రి కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంఐఎం వరుస సభలతో హడావిడి చేయడం, అందులోనూ ఇన్నాళ్లూ మిత్రత్వం కొనసాగించిన బీఆర్‌ఎస్ సర్కార్ మీద విమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసిన MIM.. 7చోట్ల గెలిచింది. ఇక 2018లో 8 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పోటీ చేసి 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని మిగతా రాజకీయపక్షాల కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది ఎంఐఎం నాయకత్వం. అందరూ ఎన్నికల మూడ్‌లోనే ఉన్నా… ప్రచార సభల స్థాయిలో ఇంకా గేరప్ అవలేదు. కానీ… మజ్లిస్ పార్టీ నాయకత్వం మాత్రం రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. దీన్నిబట్టి చూస్తే… ఎంఐఎం విస్తరణకు సిద్ధమైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో గట్టి పట్టున్న మజ్లిస్ పార్టీ… ఆ ప్రాంతానికి వెలుపల పోటీ చేసినా… అది చాలా పరిమితంగా ఉండేది. కానీ… తాజాగా ఆ పార్టీ నాయకత్వపు తీరు చూస్తుంటే… తెలంగాణలో విస్తరించాలన్న పట్టుదల కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ… అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న తీరు చూస్తే…. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లలో ఒంటరిగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు చెబుతున్నారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఎంఐఎం కూడా సింగిల్‌గా ఓల్డ్ సిటీ బయటికి వస్తే… కొన్ని సీట్లలో అయినా చతుర్ముఖ పోటీ తప్పక పోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ఎవరి ఓట్లు చీలి ఎవరికి లాభం కలుగుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. మజ్లిస్ పార్టీ పాతబస్తీ బయట సై అంటే… ముస్లిం మైనార్టీల ఓట్లు చీలడం ఖాయమంటున్నారు. అప్పుడు ఎవరికి పడాల్సిన ఓట్లు ఎటుపోతాయన్నది క్వశ్చన్. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం వెనక ముస్లింల ఓటు బ్యాంక్ ఉందన్నది ఫలితాలు చెప్పిన సత్యం. అంటే.. అక్కడ మైనార్టీ ఓట్లలో మెజార్టీ వాటా కాంగ్రెస్‌కే వెళ్ళిందన్న మాట. తెలంగాణలో కూడా చాలా నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా కాకున్నా… అవి కొంతవరకు కాంగ్రెస్‌కు మళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మజ్లిస్ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తే… ఓట్లు చీలి కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందా… అన్న అంచనాలు సైతం ఉన్నాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు సైతం ఓట్ల చీలిక భయం ఉందట. కానీ… ఎక్కువ నష్టం కాంగ్రెస్‌కే జరగవచ్చంటున్నారు విశ్లేషకులు.
- Tags
- AIMIM
- big news
- BRS
- ntv
- off the record
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!