India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- ప్రపంచ సైనిక శక్తుల్లో భారత్..
- రక్షణ వ్యయంలో 5వ స్థానం..
- సిప్రి నివేదికలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Rank: ప్రపంచ దేశాలు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచినట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక వెల్లడించింది. ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్ ఒకటిగా నిలిచింది. రక్షణ రంగ వ్యయంలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.9 శాతం పెరుగుదల అని సిప్రి నివేదిక చెప్పింది.
చైనానే టార్గెట్:
ఇదే సమయంలో భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలిపింది. 2025లో భారత్ తన అణు సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచుకున్నట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ కొత్త తరహా అణ్వాయుధ వాహక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని తెలిపింది. భారత్ ప్రధానంగా చైనాలోని లక్ష్యాలను చేరుకోగల లాంగ్ రేంజ్ క్షిపణుల్ని అభివృద్ధి చేస్తుందని నివేదిక చెప్పింది. పాక్‌తో కొనసాగున్న ఘర్షణలు కూడా భారత్ రక్షణ ప్రణాళికల్లో వేగాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో పాక్ వచ్చే దశాబ్ధ కాలంలో అణ్వాయుధ నిల్వల్ని మరింత పెంచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. 2026 ప్రారంభం వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కలిపి మొత్తం 12,187 అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు చెప్పింది.
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
రక్షణ వ్యయంలో 5వ ర్యాంక్:
2025లో అత్యధిక రక్షణ వ్యయం చేసిన దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో నిలిచింది. అమెరికా ఏకంగా 954 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. రెండో స్థానంలో చైనా 336 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. రష్యా 190 బిలియన్ డాలర్లలో మూడో స్థానంలో, జర్మనీ నాలుగో స్థానంలో, భారత్ 92.1 బిలియన్ డాలర్ల రక్షణ వ్యవంతో ఐదో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!