Off The Record: మహానాడుని వాయిదా వేసిన చంద్రబాబు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: టీడీపీ ప్రతేడాది చాలా ఘనంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు. రెండు మూడు రోజుల పాటు చేపట్టే ఆ మెగా కార్యక్రమంలో పార్టీ భవిష్యత్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి..? పార్టీ పరంగా ఏం తీర్మానాలు చేయాలి? వాటిని ఎలా అమలు చేయాలి? ఇలా మహానాడును ఓ పండుగలా చేసుకోవడం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే వివిధ సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల మహానాడును రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాగే కుదించుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ క్రమంలో ఈసారి మహానాడు నిర్వహణ ఉంటుందా..? ఉండదా..? అనే అంశంపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా.. ఈసారి మహానాడు ఉండదని.. ఎన్నికల ఫలితాల వరకు వాయిదా వేసుకోవాలని టీడీపీ డిసైడ్ అయింది.
ఈ ఏడాది ఎన్నికల హడావుడి. పైగా మహానాడు తేదీల నాటికి ఇంకా కౌంటింగ్ జరగదు. మే నెల 27-29 తేదీల మధ్య అటూ ఇటుగా టీడీపీ మహానాడును నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి కౌంటింగ్ వచ్చే నెల 4వ తేదీన జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో లీడర్లు.. కేడర్ కౌంటింగ్ ఏర్పాట్లు చూడాలి. వాళ్లంతా దానికి సంబంధించిన హడావుడిలో మునిగి ఉంటారు. ఈ సమయంలో మహానాడు నిర్వహించడం సరైన విధానం కాదనే భావనతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో 2014 ఎన్నికల్లో మే 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కానీ ప్రభుత్వం ఏర్పాట్లల్లో బిజీగా ఉండడంతో మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోలేదు. 2019 ఎన్నికల్లో ఫలితాలను మే 23వ తేదీన ప్రకటించారు. అప్పుడు టీడీపీ పరాజయం పాలైంది. దీంతో మహానాడును 2019 ఎన్నికల టైంలో నిర్వహించుకోలేదు. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ల పాటు వరుసగా జరుపుకోలేదు.
Also Read
- US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
- IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
రెండేళ్ల క్రితం 2022లో ప్రకాశం జిల్లాలో మహానాడు సభ జరిపారు. వాస్తవానికి టీడీపీకి అప్పటి నుంచే పుంజుకోవడంపై దృష్టి పెట్టంది. ఆ తర్వాత 2023లో రాజమండ్రిలో మహానాడు నిర్వహించింది టీడీపీ. ఇప్పుడు ఎన్నికల సమయం కావడం.. అది కూడా కౌంటింగ్ కంటే ముందు రావడంతో మహానాడు నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేశారు. అందుకు ప్రతిగా ఆ మూడు రోజుల్లో గ్రామ గ్రామన పార్టీ జెండాలను ఎగరేసే కార్యక్రమాలు.. రక్తదానం.. అన్నదానం లాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసింది టీడీపీ. ఫైనల్‌గా గెలుపు ఓటములను బట్టి మహానాడు నిర్వహణ ఉంటుందని టీడీపీ చెప్పకనే చెప్పింది. ఓడితే ఈ పండుగ ఇప్పటికింతే అవుతుంది. చూడాలి మరి.. అప్పటి వరకు మహానాడు రీసౌండ్ ఇస్తుందా? సైలెంట్ మోడ్‌లోకి వెళ్తుందా?
తాజావార్తలు
-
BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
-
US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
-
బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!