CM Revanth Reddy: ‘2034 వరకు నేనే సీఎంగా ఉంటా.. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి’: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీకాలంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, దీనిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల బృందంతో ఇవాళ ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్వహణలో తాము మానవత్వంతో వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులతో మాట్లాడిన సీఎం, వారి సమస్యల పరిష్కార బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమోషన్లు, బదిలీలు ఇంటికే వస్తాయని, ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల భవిష్యత్తు, బడులలో సౌకర్యాల పైనే దృష్టి పెట్టాలని కోరారు. ఐఏఎస్ అధికారులనైనా సులభంగా బదిలీ చేయవచ్చని, కానీ టీచర్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని కొనియాడారు. బడులలోని పిల్లల సమస్యలపై తనతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట
“ప్రభుత్వ బడులలో చదివితే ఏం అవుతావు?” అని ఎవరైనా అడిగితే, “తెలంగాణ సీఎం అవుతాను” అని పిల్లలు ధైర్యంగా చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని, ఎలాంటి మంత్రి పదవి అనుభవం లేకపోయినా ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్నిపాలిస్తున్నానని గుర్తుచేశారు. ఇటీవల తాను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని చెబుతూ, కేవలం తెలివి ఉంటే సరిపోదని, క్రమశిక్షణే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని నొక్కి చెప్పారు.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ఉపాధ్యాయులు అడగకపోయినా 2024 జనవరి నుంచి ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా సమయానికి వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం పెంచామని వివరించారు. అమెరికాపైనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల వైపు దృష్టి సారించాలని, భాష అనేది కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?