Off The Record: ఒక నియోజకవర్గంలో జరిగే గొడవల గురించి ఇంకో నియోజకవర్గానికి చెందిన నాయకులు పట్టించుకునే పరిస్థితి సాధారణంగాఉండదు. అలా జోక్యం చేసుకోవడానికి అవతలివాళ్ళు ఒప్పుకోరు, ఏ పార్టీ అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహించదు. కానీ… మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ…. శింగనమలలో జోక్యం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ… అసలు సమస్య ఏంటంటే… అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ టీడీపీలో అంతర్గత కలహాలు ఓ రేంజ్లో నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా మొదట్నుంచి గ్రూపులు నడుస్తున్నాయి. గత ఎన్నికల టైంలోనే.. ఆమెకు టికెట్ ఇవ్వకూడదంటూ కొందరు నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. 2019, 2024లోనూ అలాంటి ప్రయత్నాలే జరిగినా….టీడీపీ అధిష్టానం మాత్రం ఆమె వైపే మొగ్గింది. 2019లో ఓడిపోయాక కూడా గొడవలు తగ్గకపోవడంతో… నియోజకవర్గ వ్యవహారాల నిర్వహణ కోసం నర్సనాయుడు, కేశవరెడ్డితో టూమెన్ కమిటీని నియమించింది అధిష్టానం. అప్పుడు శ్రావణికి వ్యతిరేకంగా చాలా మంది పనిచేశారు. ఒకానొక దశలో ఆమె ఒంటరి అయ్యారన్నకున్న టైంలో అండగా నిలిచారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. అధిష్టానం వద్ద ఆమె గురించి ఎంతమంది వ్యతిరేకంగా చెప్పినా…. జేసీ మాత్రం సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి పరిస్థితుల్లోనే.. 2024లో మరోసారి శ్రావణికే టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం.
Read Also: Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు
ఈసారి ఆమె గెలిచినా… పరిస్థితిలో మార్పు లేకపోగా… విబేధాలు గతం కంటే ఎక్కువయ్యాయి. శ్రావణి ఎమ్మెల్యే అయ్యాక ఒంటెత్తు పోకడలకు పోతున్నారని, రేషన్ డీలర్స్ నుంచి మద్యం షాపుల వరకు అన్నీ తమ వర్గీయులకు, అందునా పార్టీ కోసం కష్టపడని వారికి ఇస్తున్నారంటూ విమర్శిస్తున్నారు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల గొడవతో ఈ వివాదాలు పీక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యే శ్రావణి నుంచి పార్టీని కాపాడాలి, సేవ్ టీడీపీ అంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనలు చేశారు. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. బండారు శ్రావణి చదువుకున్న ఎమ్మెల్యే, ఆమెకు అన్నీ తెలుసు…. అలాంటి వ్యక్తి ఫొటో పక్కన పెట్టి డబ్బులు లెక్కిస్తున్నట్లు వీడియోలు సృష్టించి వైరల్ చేయడం దారుణం అంటూ టీడీపీ నేతల మీద మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ప్రతాపం చూపిస్తున్న వాళ్ళు… ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి మాట్లాడటానికి ఎందుకు ధైర్యం చేయడం లేదని నిలదీశారాయన. బుక్కరాయసముద్రం, పుట్లూరు లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు మీటింగ్‌లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఒక మహిళా ఎమ్మెల్యేపై ప్రతాపం చూపించడమేనా మీ రాజకీయం అని విరుచుకుపడ్డారు జేసీ. పార్టీలో గ్రూపులు సహజమేనని, నా సొంత నియోజకవర్గం తాడిపత్రిలో కూడా 150 గ్రూపులు ఉన్నాయి, సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలనిగానీ… ఇలా బహిరంగంగా రచ్చ చేసుకోవడం ఏంటని శింగనమల టీడీపీ నేతల్ని నిలదీశారట.
Read Also: Chiranjeevi: దుఃఖంలో అరవింద్ ఫ్యామిలీకి అండగా చిరు
ఎమ్మెల్యే దళిత మహిళ కావడం వల్లే ఆమెపై ఈ విధంగా దాడులు చేస్తున్నారా.. అంటూ ఘాటుగానే ప్రశ్నించారట ఆయన. అంత వరకు ఓకేగానీ… అసలు ఉన్నట్టుండి జేసీ…శింగనమల రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నారన్నది ఇక్కడ బేసిక్ క్వశ్చన్. అందుకు శ్రావణి మీద సాఫ్ట్ కార్నర్ ఒకటైతే…ఇక్కడ యల్లనూరు, పుట్లూరు మండలాలు తాడిపత్రికి దగ్గరగా ఉంటాయి. ఈ రెండు మండలాల నాయకులకు ఏ కష్టం వచ్చినా… జేసీ దగ్గరికే వెళ్తుంటారు. ఈ క్రమంలోనే… ఇటీవల శ్రావణి వర్గీయులు జేసీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నట్టు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన శైలజానాథ్ సొంతంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి.. రాష్ట్ర నాయకులను పిలిపించి.. టీడీపీని తిట్టిస్తుంటే.. మీరేం చేస్తున్నారని జేసీ ప్రశ్నించారట. ప్రత్యర్థి పార్టీపై పోరాడకుండా.. సొంతోళ్ళతో కుమ్ములాటలు కరెక్ట్ కాదని అన్నట్టు తెలుస్తోంది. దీన్ని శ్రావణి వ్యతిరేకవర్గం ఎలా తీసుకుంటుందో, అధిష్టానం రియాక్షన్ ఏంటో చూడాలి మరి.