ఒక నియోజకవర్గంలో జరిగే గొడవల గురించి ఇంకో నియోజకవర్గానికి చెందిన నాయకులు పట్టించుకునే పరిస్థితి సాధారణంగాఉండదు. అలా జోక్యం చేసుకోవడానికి అవతలివాళ్ళు ఒప్పుకోరు, ఏ పార్టీ అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహించదు. కానీ... మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ.... శింగనమలలో జోక్యం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.