Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record 12 Acers Land Grabbing In Banjara Hills

Off The Record: ఆయన కండువా మార్చేశారా?.. ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారా!

Published Date :May 5, 2025 , 10:08 pm
By Sampath Kumar
  • చాలా రోజులుగా భూ ఆక్రమణ
  • ప్రభుత్వానికి దక్కిన 600 కోట్ల భూమి
  • సర్వే నెంబర్ 102/1HAK/1 లో 12 ఎకరాల స్థలం
  • కబ్జాకు గురైన ప్రాంతంలో కట్టడాలు
  • టెంట్ వేసి తన మనుషులు కాపలా
Off The Record: ఆయన కండువా మార్చేశారా?.. ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆయన కండువా మార్చేశారు.. కండువా మార్చిన ఉద్దేశం నెరవేరకపోవడంతో పార్టీ, ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారు. కుంపటి పెడితే దారిలోకి వస్తారని ఆనుకున్నారో ఏమో కానీ.. పెద్దాయన రివర్స్ గేర్ వేశారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ?.

అది ప్రైమ్ లొకేషన్. గుంట, అర గుంట భూమి కాదు.. 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు ఓ నేత. ఆక్రమణ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ.. ఇప్పటి వరకు దానివైపు అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో…అక్రమార్కుల పట్ల కూడా కఠినంగా ఉండాలని ఆదేశించారు. దీంతో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు అధికారులు. అది అంతా ఇంత కాదు.. ఏకంగా 600 కోట్ల భూమి ప్రభుత్వానికి దక్కింది. అసలు విషయానికి వెళ్తే..సర్వే నెంబర్ 102/1HAK/1 లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కట్టడాలు చేశారు. కబ్జాదారుడు దర్జాగా..టెంట్ వేసి తన మనుషులను కాపలా పెట్టారు. ఇదంతా ప్రభుత్వానికి నివేదించారు రెవెన్యూ అధికారులు. చాలా రోజులుగా జరుగుతున్న తంతుకి చెక్ పెట్టారు. నిర్మాణలు కూల్చివేశారు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురైన భూమి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పరిశీలించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. అసలు ఈ కబ్జా వెనక ఉన్నది ఎవరువనేది అసలు చర్చ మొదలైంది.

Also Read: Off The Record: ఆ కేసులు నాయకుల మెడకు చట్టుకుంటాయా?.. తలలు పట్టుకుంటోన్న వైసీపీ కేడర్‌

గులాబీ పార్టీ తరపున సదరు ఎమ్మెల్యే…తనకు అక్రమంగా వచ్చిన భూములను కాపాడుకోవడానికి అధికార పార్టీలో చేరారనే చర్చ నడుస్తోంది. సదరు నేత హ్యాండ్‌లోనే ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమి ఉందట. అక్రమంగా వెలిసిన నిర్మాణాలు నేలమట్టం అవ్వగానే… స్థానిక రెవెన్యూ అధికారికి సదరు నేత నుంచి ఫోన్ కాల్ వెళ్లిందట. ఏం చెప్పాలో తెలియక సదరు అధికారి తనపై అధికారికి ఫోన్ చేసి సమస్యను చెప్పుకున్నారట. ఇక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలని చెప్పేశారట. కాంగ్రెస్ పార్టీలో చేరి…భూమి వ్యవహారాన్ని సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంత వరకు వ్యవహారం బాగానే ఉన్నా…పని చేయలేదని ప్రభుత్వం మీద నెగిటివ్ కామెంట్స్ చేసి దారిలోకి తెచ్చుకోవాలని అనుకున్నారేమో.. కానీ ప్లాన్‌ రివర్స్ అయ్యింది. తాను ఒకటి తలిస్తే… దైవం మరొకటి తలిచింది అన్నట్టు సదరు నేత పరిస్థితి తయారైంది. అందరిని గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని చూశారు…కానీ అది రివర్స్ అవ్వడంతో ఇపుడు యాక్షన్ ప్లాన్ ఏదో రెడీ చేసుకుని ఉంటారు అనే టాక్ మొదలైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Land Grabbing
  • off the record
  • OTR
  • telangana

తాజావార్తలు

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions