Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్‌ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం వంటి సానుకూల విధానాలతో పిల్లలకు ఆరోగ్యవంతమైన బరువును కొనసాగించడంలో సహాయపడవచ్చు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
నిజానికి ప్రస్తుత జీవనశైలి మార్పులే పిల్లల్లో స్థూలకాయాన్ని భారీగా పెంచుతున్నాయి. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్, అధిక కేలరీలు కలిగి తక్కువ పోషక విలువ గల ఆహారాలను తినడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే, శారీరక చర్యలు తగ్గిపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంట్లోనే ఉండి టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల వాడకంతో పిల్లలు ఎక్కువగా కూర్చునే చేసే పనులకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల కాలరీలు తక్కువగా కఖర్చు కావడం ద్వారా.. బరువు పెరుగుతుంది.
మరోవైపు పిల్ల తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్స్ కారణంగా రెడీ ఫుడ్ లేదా హోటల్స్‌లో భోజనం చేయడం వంటి పనులు ఎక్కువయ్యాయి. ఇవి అధిక ఫ్యాట్, చక్కెర, ఉప్పు కలిగి ఉంటాయి. ఇంటి వద్ద తయారయ్యే ఆహారం, కుటుంబ భోజనాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. పాఠశాలల్లో సరైన పోషకాహారంపై అవగాహన లేకపోవడం లేదా ఆరోగ్యకరమైన భోజనం అందుబాటులో లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మరి స్థూలకాయం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయాల్సిన చర్యలను చూసినట్లయితే..
ఇందులో మొదటగా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కల్పించాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామాన్ని ప్రోత్సహించాలి. ఇంకా మంచి సహాయక వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలి. ముఖ్యంగా ఈ విధానాలను అనుసరించడంలో తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారం తిని వ్యాయామం చేస్తే, సంతోషంగా జీవిస్తే పిల్లలు కూడా అదే దారిలో సాగుతారు.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!