Sheraj Mehdi: ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షెరాజ్ మెహదీ. ఈ చిత్రంలో హీరోయిన్లుగా విహాన్షి హెగ్డే, కృతి వర్మలు నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
READ ALSO: Cigarette prices: రూ. 18 నుంచి రూ. 72కి పెరగనున్న సిగరెట్ ధరలు.?
ఈ సందర్భంగా హీరో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ఒక ఏడాదికి ఓ మంచి సినిమా వస్తుంది. అలాంటి ఓ మంచి సినిమానే మా ‘ఓ అందాల రాక్షసి’ అని అన్నారు. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుందని, వాళ్లు ఎలా ఉండాలో చెప్పే సినిమా అవుతుందని చెప్పారు. కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకు కథ, మాటల్ని రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారని అన్నారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు కృతి వర్మ, విహాన్షి హెగ్డే, తదితరులు పాల్గొన్నారు.
READ ALSO: TFCC: ఫిలిం ఛాంబర్‌పై ‘ప్రోగ్రెసివ్’ జెండా!