NTV Telugu Site icon

Nvidia Mcap: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా

New Project (6)

New Project (6)

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి. కంపెనీ షేర్లు జూన్ 18న 3.4 శాతం పెరిగాయి. దీంతో దాని మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను దాటేసింది. 2024 లో ఇప్పటివరకు ఎన్ విడియా షేర్లు 160 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఇప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు నంబర్ 2 కు పడిపోయింది. నంబర్ 2గా ఉన్న ఆపిల్ ఇప్పుడు నంబర్ 3 కి పడిపోయింది.

READ MORE: Nagababu: నేను ఇదే మొదటిసారి అసెంబ్లీ చూడటం..

ఎన్ విడియా గత రెండు దశాబ్దాల్లోనే మొట్టమొదటిసారి ఈ నెలలోనే ఆపిల్ మార్కెట్ విలువను అధిగమించింది. అదే జోరును కొనసాగిస్తూ మైక్రోసాఫ్ట్ ను కూడా వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్ విడియా ఆర్టిఫీషిల్ ఇంటెలిజెన్స్ ఆదారిత చిప్ లు తయారు చేస్తున్నందువల్లే ఇన్వెస్టర్లు ఆ స్టాక్ ను కొనుగోలు చేసేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారని అమెరికా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐ ఆదిపత్యం ఎలా ఉంటుందో తెలిపేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఏఐ సాంకేతికత ద్వారా ఎన్ వీడియా అత్యధిక ప్రయోజనం పొందుతున్నట్లు వివరించారు. ఏఐ చిప్ లను తయారు చేస్తున్నందువల్లే ఎన్ విడియా సేల్స్ ఏడాది కాలంలోనే 125 శాతం పెరిగినట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. చాట్ జీపీటీని రూపొందించిన ఏఐ సంస్థ ఓపెన్ ఏఐతో కూడా జట్టుకట్టింది. ఇటీవలే ఏఐ కి సంబంధిం భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించింది. దీంతో మైక్రోసాఫ్ట్ స్టాక్ కూడా ఇటీవల కాలంలో ర్యాలీ చేసింది. రానున్న రోజుల్లో ఎన్ విడియా, ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు మొట్టమొదటి 4 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించేందు తీవ్రంగా పోటీ పడతాయని వెడ్ బుష్ సెక్యూరిటీస్ అనలిస్ట్ డేనియ్ ఐవ్స్ పేర్కొన్నారు. ఎన్ విడియా సాధారణ చిప్ మేకర్ కాదని కంపెనీ సీఈఓ, ఇన్వెస్టర్ జెన్సెన్ హూవాంగ్ అన్నారు. ఈ కంపెనీ విక్రయిస్తుంది చిప్స్ ను మాత్రమే కాదని, సిస్టమ్స్ ను అని పేర్కొన్నారు.

READ MORE: ED: కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ..హైకోర్టును చేసి ఈడీ..కొద్ది సేపట్లో విచారణ

ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 5 కంపెనీలు ఇవే..
1. ఎన్‌విడియా – మార్కెట్ విలువ – 3.33 ట్రిలియన్ డాలర్లు
2. మైక్రోసాఫ్ట్ – మార్కెట్ విలువ – 3.31 ట్రిలియన్ డాలర్లు
3. ఆపిల్ – మార్కెట్ విలువ – 3.28 ట్రిలియన్ డాలర్లు
4. ఆల్ఫబెట్ – మార్కెట్ విలువ – 2.17 ట్రిలియన్ డాలర్లు
5. అమెజాన్ – మార్కెట్ విలువ – 1.90 ట్రిలియన్ డాలర్లు