1.ఆంధ్రప్రదేశ్‌లో ఫిట్‌మెంట్, పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.. ప్రభుత్వ ప్రకటనతో భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనికోసం సోమవారం సీఎస్‌ను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు.. అయితే, మరోవైపు.. ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.
2.కొడాలి నాని పై వస్తున్న గుడివాడ కేసీనో..టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంశం పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..ప్రతిపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. జగన్ ప్రభుత్వం ఎవ్వరికీ చుట్టం కాదన్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే ముఖ్యమంత్రి ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని అన్నారు.
3.సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు.
4.మార్కెట్ చూపిన బలమైన వృద్ధి ఔట్‌లుక్‌ను దృష్టిలో ఉంచుకుని, జాతీయ, నగర ఆధారిత కంపెనీలకు చెందిన అనేక రెసిడెన్షియల్ డెవలపర్‌లకు హైదరాబాద్ విస్తరణ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ జోరు 2022 మరియు అంతకు మించి కొనసాగుతుందని భావిస్తున్నారు.
5.దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
6.ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ?
7.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లిహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ సింగర్ శ్రీలలిత. మొక్కలు నాటడం సంతోషంగా ఉంది..ప్రకృతి మనకు తల్లిలాంటిది అని అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు శ్రీలలిత.
8.నక్కపల్లి మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంయత్నం కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత? అని ఆమె మండిపడ్డారు.
9.దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది ‘లూజర్’ వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన టైమ్ లో అంటే… 2020 మే 15న ‘లూజర్’ ఫస్ట్ సీజన్ కు సంబంధించిన మొత్తం పది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే వెబ్ సీరిస్ సీజన్ 2కు సంబంధించిన ఎనిమిది ఎపిసోడ్స్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
10.పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ మరోసారి బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా రెండో వన్డేలో కూడా అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది. తొలి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో కూడా ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయాల్సి ఉంది.