నవరత్నాల మాయలో పడొద్దు
అనంతపురంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో గంజాయి వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్ చేశారు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ. లోకేష్ పాదయాత్ర కి సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు బాలకృష్ణ, గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి యువత కు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై విమర్శలు చేశారు బాలకృష్ణ. నవరత్నాల మాయలో పడి ఓటుని వృధా చేసుకోవద్దన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. యువతకు టీడీపీ లో జరిగింది ఏంటి..? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి.? తెలుసుకోవాలన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ. ముఖ్యమంత్రి కి మెగా బైట్స్, గిగా బైట్స్ అంటే ఏంటో తెలుసా…?రాష్ట్రంలో ఏం జరుగుతుందో…లోకేష్ రాష్ట్ర పరిస్థితులను వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్త పడాలి. ఏపీలో అసమర్ధ పాలన… చెత్త పరిపాలన నడుస్తోంది. రాజధాని లేని రాష్ట్రం… పోలవరం ఊసేలేదు..అభివృద్ధి ఏం లేదు…సప్త శూన్యం. ఉద్యోగాలు లేవు…వలస పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గంజాయి రాష్ట్రంగా ఏపీ నెంబర్ వన్. చెత్త మీద పన్ను…మన ఖర్మ. శాండ్, ల్యాండ్ మాఫియా రాష్ట్రంలో రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు బాలయ్య.
సంకల్ప సిద్ది కేసులో కీలక పురోగతి
విజయవాడ సంకల్ప సిద్ది కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డైరెక్టర్ గుత్తా కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు.. సంకల్ప సిద్ది కేసులో చైర్మన్ గుత్తా గోపాలకృష్ణ తర్వాత మొత్తం వ్యవవహరం నడిపించాడు కిరణ్. 4 నెలల క్రితమే చైర్మన్ గోపాలకృష్ణ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కిరణ్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. కిరణ్ కోసం గత కొన్ని నెలలుగా బెంగుళూరు, గోవా, బళ్ళారి లో గాలిస్తున్నారు బెజవాడ పోలీసులు. ఎట్టకేలకు నిన్న రాత్రి బెంగుళూరు లో కిరణ్ ని అదుపులోకి తీసుకుని బెజవాడ తీసుకువచ్చారు పోలీసులు. 200 కోట్లకు పైగా సంకల్ప సిద్దిలో మోసం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ సంకల్ప సిద్ధి కుంభకోణం కలకలం రేపింది. దీని విలువ 1400 కోట్లు వరకూ ఉంటుందని భావిస్తున్నారు. భూముల్లో ఎర్రచందనం మొక్కలున్నాయంటూ తప్పుడు ఆశలు చూపించి మోసం చేశారు. ధనార్జనే ధ్యేయంగా అబద్ధాలతో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.సంస్థ వసూలు చేసిన రూ.1400 కోట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ దర్యాప్తు సాగింది. ఈ కుంభకోణంలో మొత్తం 40 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారించారు. ఈ సంస్థ ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయనే దానిపై, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. గుత్తా కిరణ్ పట్టుబడడంతో అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు.
కిక్కిరిసిన ఏడుకొండలు.. వరుస సెలవులతో పెరిగిన రద్దీ
కలియుగ వైకుంఠం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ ఆపద మొక్కులవాడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుపతికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాస వసతి సముదాయాల వద్ద గంటల తరబడి టోకెన్ల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. చంటిబిడ్డలు, వృద్థులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరుస మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కోసం రెండు, మూడు టీటీడీ సత్రాల వద్దకు చేరుకున్నారు భక్తులు. ఇంకా వేసవి సెలవులు రాకుండానే ఈ స్థాయిలో భక్తులు రావడంతో దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లుచేశారు. కాగా తిరుమలలో గత కొద్దికాలంగా 60 నుంచి 70వేలమంది దర్శనానికి వస్తున్నారు. శుక్రవారం 30 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచివున్నారు భక్తులు..టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు గా టీటీడీ తెలిపింది.
నేనెవరినీ కించపరచలేదు.. ఆవేదన చెందా అంతే
బాపట్లలో గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న వివాదాలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కోన రఘుపతి. దళిత సోదరులను కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు…ఎవరో నా మాటలు వక్రీకరించారు.. బాపట్ల పార్లమెంట్ నుండి పొన్నూరు ను వేరు చేశారని ఆవేదన మాత్రమే నేను తెలిపాను.. నా మాటల వల్ల దళిత సోదరులు నొచ్చుకొని ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను అన్నారు కోన రఘుపతి. బాపట్లలో కులాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు…. రాజకీయ పార్టీల ట్రాప్ లో దళిత సోదరులు పడవద్దని కోరారు. ఈమేరకు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వీడియో విడుదల చేశారు.ఇటీవల కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు కావడం దురదృష్టకరమని.. సంతనూతలపాడును బాపట్ల పార్లమెంట్‌లో కలిపారరి రఘుపతి అన్నారు. లేదంటే పొన్నూరుతో కలిసి బాపట్ల ఓసీ పార్లమెంట్‌గా ఉండేదన్నారు. బాపట్ల జిల్లా ఏడాదైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో కోన రఘుపతి ఈ తరహా కామెంట్లు చేశారు.
కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది. దీని వల్లే దేశంలో కరోనా కేసుల ఆకస్మిక పెరుగుదలకు కారణం అని తెలుస్తోంది. ఢిల్లీలో కరోనా సోకిన రోగుల నుండి సేకరించిన నమూనాలలో 98 శాతం XBB.1.16 వేరియంట్ కేసులే. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ సబ్ వేరియంట్ XBB.1.16ని నిశితంగా గమనిస్తోంది. ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదం కాకున్నా.. కేసుల్లో పెరుగుదలకు కారణం అవుతోంది. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తంగా ఉంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ రోజు కేంద్రం అత్యున్నత సమావేశాన్ని నిర్వహించబోతోంది.
span style=”color: #ff0000;”>లక్షణాలు ఇవే..
ఈ వేరియంట్ కారణంగా జ్వరం వస్తుంది. ఇది 1-2 రోజుల వరకు కొనసాగుతుంది. గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, పొత్తి కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. దగ్గు, జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. XBB.1.16 వేరియంట్ ఎటువంటి తీవ్రమైన సమస్యలను కలిగించదు. అయినప్పటికీ వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారు దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
గన్ను పట్టుకొని గన్నులా ఉన్నాడు…
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. మమ్ముట్టీ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయ్. గ్లిమ్ప్స్ తోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన సురేందర్ రెడ్డి అండ్ అఖిల్ పక్కా హిట్ కొడతారు అనే నమ్మకం అందరిలో కలిగించారు. టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ గన్స్ ఫైర్ చేస్తుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ… అఖిల్ ని నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. స్టైలిష్ మేకర్ గా పేరున్న సురేందర్ రెడ్డి, అఖిల్ లాంటి అల్ట్రా మోడరన్ హీరో దొరకగానే.. తన పొటెన్షియాలిటి మొత్తం తెరపై చూపించడానికి రెడీ అయినట్లు ఉన్నాడు. పోస్టర్స్ తోనే హీటు పెంచుతున్న ఈ మూవీ నుంచి అఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చేసింది. బుడాపెస్ట్ లో షూట్ చేసిన ఫైట్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో అఖిల్ గన్ను పట్టుకున్న ఇంకో గన్నులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తున్న అఖిల్ పుట్టిన రోజు ఏప్రిల్ 8, అందుకే అక్కినేని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఒక రోజు ముందే మేకర్స్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్ ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 8న మరిన్ని అప్డేట్స్ వస్తాయి వెయిట్ చెయ్యండి అంటూ మేకర్స్ చిన్న హింట్ కూడా ఇచ్చారు. మరి ట్రైలర్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.
కొన్నేళ్ళలో భారత కెప్టెన్‌గా సంజు శాంసన్
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన బ్యాటర్లలో సంజూ శాంసన్ ఒకరు. 28 ఏళ్ల అతను ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను కలిగి ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పాల్గొన్న ఇన్ని సంవత్సరాలలో తన IPL జట్ల కోసం అనేక అత్యుత్తమ నాక్‌లను ఆడాడు. గత రెండేళ్లలో, తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. కేరళకు చెందిన క్రికెటర్ తన నాయకత్వ నైపుణ్యంతో కూడా ఆకట్టుకున్నాడు. సంజూ శాంసన్ IPL 2021లో మొదటిసారిగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.. కానీ 14 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలవగలిగాడు. కానీ గత సంవత్సరం, అతను మెరుగైన మరియు మరింత సమతుల్య జట్టుతో ముందుకు సాగాడు. ప్రారంభ ఎడిషన్ 2008 విజేతగా నిలిచిన తర్వాత మళ్లీ 2022లో మొదటిసారిగా IPL ఫైనల్‌కు చేరుకుంది. RR ట్రోఫీని గెలుచుకోవడంలో విఫలమైనప్పటికీ, జట్టు ప్రదర్శనతో ఆకట్టుకుంది. సంజు తన కెప్టెన్సీతో ఈసారి చాలా మంది కొత్త అభిమానులను సంపాదించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రాయల్స్‌కు అతని నాయకత్వ నైపుణ్యాలను చూసి ముగ్ధుడై, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ ప్రదర్శన ఇస్తే భవిష్యత్తులో భారత పురుషుల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించగలడని తాను భావిస్తున్నానని చెప్పి పెద్ద అంచనా వేసాడు.
క్యాబ్ డ్రైవర్ పై అటాక్.. కత్తితో దాడి చేసి కారుతో పరార్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద దారుణం చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేసి క్యాబ్ తో పరారైన ఘటన నగరంలో కలకలం రేపుతుంది. కంచన్‌బాగ్, హఫీజ్‌బాబానగర్ కు చెందిన మీర్జా ఆజంబేగ్ (21) వృత్తి రిత్యా క్యాబ్ డ్రైవర్. యూబర్ క్యాబ్ సర్వీస్‌లో డ్రైవర్. గురువారం తెల్లవారు జామున 12.45 గంటలకు యూబర్ యాప్‌లో వచ్చిన మెసేజ్ప్రకారం టిఎస్ 09 యు.డి 4323 నెంబర్ గల మారుతి కారులో మీర్జా ఆజంబేగ్ ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ వద్ద పికప్ చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాల్సి ఉండగా ముందుగా ఓటీపీ చెప్పమని క్యాబ్ డ్రైవర్ అడిగాడు. ఫోన్ ప్రాబ్లమ్ ఉందని, మార్గ మధ్యలో చెబుతానని చెప్పడంతో పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ దాటగానే ఓ వ్యక్తి వాష్ రామ్ అంటూ కారు ఆపాలని చెప్పడంతో తాను ఎయిర్ పోర్ట్ దగ్గర లోనే ఉందని అక్కడ అపుతానని చెప్పాడు. దీంతో వెనుక సీటులో కూర్చున్న ఓ వ్యక్తి వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా, నా పక్కన సీటులో కూర్చున్న వ్యక్తి కత్తితో క్యాబ్ డ్రైవర్‌పై దాడిచేశాడు. క్యాబ్ డ్రైవర్ తలకు బలమయిన గాయాలు అవ్వడంతో వెంటనే కారు ఆపి కిందకు దిగాడు. సదరు వ్యక్తులు క్యాబ్‌తో పరారయ్యారు. క్యాబ్ డ్రైవర్ మరొక కారు లిఫ్ట్ తీసుకుని మరీ వెంబండించిన ఫలితం లేకుండా పోయింది.
మీ పాన్ కార్డు ఎవరు వాడుతున్నారో తెలుసా?
ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన పాన్ కార్డును వేరే వాళ్లు వాడడం మూలంగా ఐటీ శాఖ ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి నోటీసులు పంపించింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్‌లోని భిల్వారా ప్రాంతంలో 12.23 కోట్ల లావాదేవీకి సంబంధించి వికలాంగ స్టేషనరీ దుకాణదారుడికి ఆదాయపు పన్ను నోటీసు జారీ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుకాణదారుడు అంత మొత్తంలో లావాదేవీలేమీ చేయలేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఎందుకు పంపింది? దీని వెనుక కారణం ఏమిటో అతనికి తెలియలేదు. కిషన్ గోపాల్ చాపర్వాల్ నోటీసును మళ్లీ మళ్లీ చదివినప్పుడు, తన పేరు మీద నోటీసు జారీ చేసినట్లు వచ్చినది నిజమేనని గ్రహించాడు. అనంతరం ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. అప్పుడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.