KTR: లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు..
- లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది..
- లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు..
- పోలీసులు, ఐపీఎస్ అధికారులకు ఇంత స్వామి భక్తి వద్దు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది అని కేటీఆర్ అన్నారు. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది.. దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు తమ ఆవేదన చెప్పుకున్నారు.. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారు.. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు.. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు.. ఇక, సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు.. కానీ సురేష్ కు భూమి ఉంది.. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Read Also: Vizag Crime: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి.. వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇక, పోలీసులు, ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం.. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుందన్నారు. లగచర్లలో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉంది.. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరు.. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు.. కానీ అదంతా బాక్వాస్ అని నరేందర్ రెడ్డి లేఖ రాశారని ఆయన తెలిపారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారు.. పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మీడియాతో చెబుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Robinhood : నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్.. అంచనాలు పెంచేలా టీజర్
అలాగే, నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైన్ వేశారు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తా.. రైతులను పోలీసులు తీవ్రంగా కొట్టారు.. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించలేదు.. ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టను.. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తాను అని పేర్కొన్నారు. ఫార్మా సిటీని కేసీఆర్ మంచి ఉద్దేశంతో ముచ్చర్లలో పెట్టారు.. అందుకోసం చైనాకు వెళ్లి అక్కడ 70 వేల ఎకరాల్లో ఉన్న తయారీ పరిశ్రమను పరిశీలించి వచ్చారు.. ఎకానమీ ఆఫ్ స్కేల్ అనే ప్రయోజనం ఉండే విధంగా ఫార్మాసిటీ ని ప్లాన్ చేశారు.. ఫార్మాసిటీ కోసం 8 ఏళ్లు కష్టపడ్డాం.. 14 వేల ఎకరాల భూమి సేకరించాం.. కొడంగల్ లో భూముల సేకరణకే ఇంత గొడవ జరిగితే.. ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు ఉన్నాయి.. వాటిని సేకరించే విషయంలో ఇంకా ఎంత గొడవ జరగాలి? అని ప్రశ్నించారు. కానీ మేము రైతులను ఒప్పించి వారికి నచ్చచెప్పి భూసేకరణ చేశాం.. కానీ, ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు.. అందుకే రాగానే ఫార్మాసిటీ రద్దు అంటూ ప్రకటన చేసేశాడు.. ఇప్పుడు ఆయన ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్ లకు పర్మిషన్ రావటానికి కూడా ఏడాదికి పైగా సమయం పడుతుందని కేటీఆర్ తెలిపారు.
Read Also: SSMB 29: రాజమౌళి – మహేష్ సినిమాకి నో లిమిట్స్
కాగా, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నాడు.. కానీ అది జరగటం సాధ్యం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. నేను గతంలో పరిశ్రమల మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతున్నా.. ఓ ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కు పరిశ్రమలను తరలించటం అనేది అంత సులువైన పని కాదు.. కేసీఆర్ చేసిన దానికి వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఫార్మా సిటీకి ఫార్మా విలేజ్ పేరు మార్చి మేము చేసిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడు.. ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.. వెల్దడలో వాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయి.. ఫార్మా సిటీ వస్తే కాలుష్యం అవుతుందని మీరే కదా గతంలో ప్రజల మనసులో విషం నింపారు.. ఇప్పుడు కొడంగల్ లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!