Robinhood : నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్.. అంచనాలు పెంచేలా టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈరోజు అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైంది, ఇది ఇంటెన్స్ నెరేటివ్ కి టోన్‌ని సెట్ చేస్తుంది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వెంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీలీలని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
TG Vishwa Prasad: భారీగా నష్ట పోయాం.. టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ సారి, టీజర్ నితిన్ పాత్రపై మరింత ఇన్ సైట్ ని అందిస్తూ, మూవీ ప్రిమైజ్ ని గ్లింప్స్ గా అందిస్తుంది. వినోదం, యాక్షన్, బ్రెత్ టేకింగ్ మూమెంట్స్ బ్లెండ్ తో దర్శకుడు ప్రేక్షకులను కట్టిపడేశాడు. నితిన్ రాబిన్‌హుడ్‌గా అదరగొట్టారు, డిఫరెంట్ లుక్‌లలో డైనమిక్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఒక సీన్ నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్, మరో సీన్ లో అరబ్ షేక్‌గా కనిపించి తీరు విశేషంగా అలరించింది. సినిమా రెండు విభిన్న కోణాలను, నితిన్ వెర్సటాలిటీని హైలైట్ చేస్తుంది. శ్రీలీల రిచ్ అండ్ ఆరోగేంట్ గర్ల్ గా తన పాత్రలో అలరించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో పాత్రలను కూడా టీజర్ పరిచయం చేసింది. సాయి శ్రీరామ్ తన అద్భుతమైన కెమెరా పనితనంతో రిచ్ నెస్ తీసుకొచ్చారు. జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో భావోద్వేగాల ఎలివేట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సినిమాపై ఈ టీజర్ అంచనాలను పెంచింది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!