ఉత్తర కొరియా ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో నార్త్ కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపుతుంది. ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారు జామున ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సైట్ నుంచి ఈ రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.