Noida: అరె బాబు ఏంట్రా ఇది.. పోస్టుమార్టం గదిలో అదేం పనిరా..!
- నోయిడాలో ఓ షాకింగ్ వీడియో
- సెక్టార్ 94లో ఉన్న పోస్ట్‌మార్టం హౌస్‌లో అశ్లీల వీడియో
- ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడి
- ఆ నీచ పనిని వీడియో తీస్తున్న మరో వ్యక్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ పక్క దేశంలో కోల్‌కతా ఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఆ ఘటన మరువక ముందే అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నోయిడాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 94లో ఉన్న పోస్ట్‌మార్టం హౌస్‌లో అశ్లీల వీడియో బయటపడింది. ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేగాక.. ఆ నీచ పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు.
Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ నేలమట్టం..(వీడియో)
Also Read
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. పోస్ట్‌మార్టం హౌస్‌లోని డీప్ ఫ్రీజర్ రూమ్‌లో ఒక వ్యక్తి మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించాడు. వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు తన వంతు అని చెబుతున్నాడు. మృతదేహాలను డీప్ ఫ్రీజర్‌లో ఉంచిన గదిలో ఈ నీచపనికి పాల్పడ్డారు. అయితే.. పోస్ట్‌మార్టం హౌస్‌లో మహిళా ఉద్యోగి ఎవరూ లేరు. ఈ క్రమంలో.. ఆ మహిళను బయటి నుండి తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు. ఆ మహిళ అక్కడకు ఎలా వచ్చిందనే సందేహాలు తలెత్తుతున్నాయి. చట్టపరమైన అవసరాల ప్రకారం భద్రపరచబడిన మృతదేహాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాగా.. మహిళతో సంబంధం ఆమె అంగీకారంతోనే జరిగిందా లేక బలవంతంగా జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
India Tour to England: భారత్-ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ విడుదల..
పోస్టుమార్టం నిర్వహించే హౌస్ లో ప్రతిరోజూ ఇద్దరు స్వీపర్లు విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం.. ఒక వైద్యుడు, ఫార్మసిస్ట్ ఒక్కొక్కరు పోస్ట్ మార్టం కోసం వెళతారు. ఈ వీడియో డాక్టర్, ఫార్మాసిస్ట్ రావడానికి రెండు గంటల ముందు తీశారు. కాగా.. పోస్టుమార్టం హౌస్ లో పని చేసే స్వీపర్ కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్నట్లు పోస్టుమార్టం హౌస్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ జైసాలాల్ తెలిపారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు. పోస్ట్ మార్టం హౌస్ లో ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నోయిడా డీసీపీ స్పందిస్తూ.. ఈ సంఘటనకు సంబంధించి ప్రమేయం ఉన్న వ్యక్తిని పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నాము. పోలీస్ స్టేషన్ సెక్టార్-126లో కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!