నోయిడాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 94లో ఉన్న పోస్ట్‌మార్టం హౌస్‌లో అశ్లీల వీడియో బయటపడింది. ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేగాక.. ఆ నీచ పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు.