Fake iPhones: తక్కువ ధరలకే నకిలీ ఐఫోన్లు.. విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake iPhones: తక్కువ ధరలకే ఐఫోన్లు అంటూ జనాలను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు నోయిడా పోలీసులు. నకిలీ ఐఫోన్లు విక్రయిస్తున్న నోయిడా గ్యాంగ్‌లోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో (NCR) తక్కువ ధరకు చైనా తయారు చేసిన డూప్లికేట్ యాపిల్ ఐఫోన్లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను నోయిడా పోలీసులు గురువారం పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి 60 డూప్లికేట్ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నామని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) సాద్ మియాన్ ఖాన్ తెలిపారు.
పోలీసుల ప్రకారం.. ఈ ముఠా ఐఫోన్ 13ను రూ.53వేలకే అందిస్తామని కొనుగోలుదారులను ఆకర్షించింది. ఈ ఫోన్ సాధారణంగా మార్కెట్లో రూ.66వేలుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఢిల్లీ మార్కెట్ల నుంచి కేవలం రూ.12,000 చొప్పున డూప్లికేట్ ఫోన్లను కొనుగోలు చేసింది. రూ.4.500 ఖరీదు చేసే నిజమైన ఐఫోన్ బాక్సులను, రూ.వెయ్యి విలువ గల యాపిల్ ఫోన్ స్టిక్కర్లను కొనుగోలు చైనీస్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ డూప్లికేట్ ఫోన్లతో పాటు అసలైన స్టిక్కర్లు, బాక్స్‌ల ధర మొత్తం ఒక్కొక్క దానికి రూ.17,500 వరకు ఈ ముఠా ఖర్చు చేసింది. మోసపోయిన కొనుగోలుదారులకు IMEI నంబర్‌ను చూపించి వారిని మోసం చేసేందుకు మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఉపయోగించారని పోలీసులు తెలిపారు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Leopard Attack: ఇంట్లో ఉన్న వృద్ధుడిని ఈడ్చుకెళ్లి చంపేసిన చిరుత!
అరెస్టయిన వారిని లలిత్ త్యాగి, అభిషేక్ కుమార్, రజనీష్ రంజన్‌గా గుర్తించినట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియాన్ ఖాన్ తెలిపారు. సెక్టార్ 63 పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు కేసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా డూప్లికేట్ ఐఫోన్లను విక్రయించి ప్రజలను మోసం చేసింది. కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారుడు తనకు మొదట తక్కువ ధరకు నిజమైన ఐఫోన్‌ను ఇచ్చాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారి నుంచి కొనుగోలు చేసాడు. కానీ అతను మరిన్ని ఫోన్ల కోసం ఆర్డర్ చేసినప్పుడు నకిలీ మోడళ్లను విక్రయించారని అధికారి వెల్లడించారు. ముఠా వద్ద నుంచి 60 డూప్లికేట్ ఐఫోన్లు, రూ.4.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వారు ఉపయోగించిన రెనాల్ట్ డస్టర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ చెప్పారు. పోలీసు బృందం కొన్ని నకిలీ ఆధార్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ఈ విషయంలో విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..