దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ…