Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story No Relief For Arvind Kejriwal Yet Sc Likely To Hear Case On Thursday Or Next Week

Kejriwal: కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Published Date :May 7, 2024 , 3:13 pm
By Suresh Maddala
Kejriwal: కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ విషయంలో ఆయనకు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కేజ్రీవాల్ కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది అసాధారణ పరిస్థితి అని.. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించింది. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని… లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి కాబట్టి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి: Radhika Khera: కాంగ్రెస్ వేధింపుల కారణంగా బీజేపీలో చేరిన రాధికా ఖేరా..

అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని.. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదని తెలిపింది. ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఈ కేసులో కేజ్రీవాల్‌ దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొంది. 9 సమన్లను పట్టించుకోలేదని.. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి తెలిపింది.

ఇది కూడా చదవండి: CM YS Jagan: తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు..!

అనంతరం కేజ్రీవాల్ తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. ఒకవేళ ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోమని.. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని అభిప్రాయపడింది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వచ్చే గురువారం లేదా నెక్ట్స్ వీక్ వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Rain forecast: బెంగళూరు ప్రజలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ..

 

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైల్లో పెట్టారు. తాజాగా మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind Kejriwal
  • Bail
  • case
  • delhi excise policy case
  • Next week

తాజావార్తలు

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions