దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ వేసవిలో బెంగళూరులో నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఏడు జిల్లాలకు వర్ష సూచన చేసింది. రాష్ట్రం మీదుగా వీచే గాలులు దిశ మార్చుకోవడంతో వర్షం పడేందుకు అవసరమైన సానుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం కేవలం బెంగళూరు పట్టణంలోనే వర్షం కురిసింది. కాని మంగళవారం రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్ లలోని కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షం పడింది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. అదేవిధంగా మంగళవారం నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం , ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
READ MORE: Arvind Kejriwal: బెయిల్ ఇస్తే అధికారిక విధులు నిర్వహించొద్దు.. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు సూచన
నీలగిరి, కోయంబత్తూరు, దిండిగల్, తేని, తెన్‌కాశి, విరుదునగర్, తిరునెల్వేలి జిల్లాల్లో ఒకటీరెండు చోట్ల ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజధాని నగరం చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్టంగా 104 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వెల్లడించింది. తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఒక దశలో ఈ గాలుల వేగం 65 కిలోమీటర్ల వరకు చేరుతుందని తెలిపారు. అందువల్ల జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ చెప్పిన సూచనలు తప్పక పాటించాలని తెలిపింది. వర్షాలు అధికంగా కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది.