ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC)కి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ లేఖ రాయడం చర్చగా మారింది.. ప్రజా ప్రయోజనం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు అంటూ ఏపీఈఆర్సీకి విజ్ఞప్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. వంద శాతం ఎలక్ట్రిక్ రైళ్లను నడపాలని ధ్యేయంగా పెట్టుకున్నాం.. కానీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే సామాన్య ప్రజలపై.. ప్రయాణాల పైనా భారం పడుతుందని పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు.