NTV Telugu Site icon

Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన.

Ysrcp

Ysrcp

Magunta Sreenivasulu Reddy: ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మాగుంట పోటీపై స్పష్టత ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం చెబుతోంది. మంగళవారం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయినా మాగుంట పోటీపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా కొలిక్కిరాలేదు. సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చి గత మూడు రోజులుగా బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో గత మూడు రోజులుగా మాజీమంత్రి బాలినేనితో జిల్లా లోని పలు నియోజవర్గాల వైసీపీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న

మూడు రోజులుగా సీఎం జగన్‌ను కలిసేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు గత కొన్ని నెలలుగా నగదు వేయాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరుతున్నారు. పలుసార్లు ఇదే విషయమై సీఎం జగన్ సహా ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని బాలినేని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. భూములకు నగదు విషయంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు. పలు విషయాల్లో స్పష్టత వచ్చాకే సీఎం జగన్‌తో కలుస్తానని విజయసాయిరెడ్డికి బాలినేని చెప్పారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సీఎం జగన్‌ను కలవకుండానే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.